స్తంబ్రాది స్ఫూర్తి పురస్కార్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
06-07-2026 05:14 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మొగిలి ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం లైన్స్ క్లబ్ భవనం నందు స్తంబ్రాది స్ఫూర్తి పుష్కారం 2026 వ సంవత్సరానికి భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నరాల సాంబశివారెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుకుపల్లి ఉపేంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నరాల సాంబశివారెడ్డికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భవిష్యత్తులో కళా రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని, అదేవిధంగా క్రీడార రంగంలో కూడా విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.






