రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక: ఎస్సై బాబు
16-03-2026 06:59 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో 2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హుమేరా మస్జిద్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మఠంపల్లి ఎస్సై పి.బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ను నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిములు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారని తెలిపారు. రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ కరీం,2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్, గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ రహీం, రిజ్వాన్, మౌలానా సయ్యద్ షకీల్, షేక్.బాబు, తదితరులు పాల్గొన్నారు.




