30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అంబరాన్నంటిన గ్రాడ్యుయేషన్ వేడుకలు

16-03-2026 07:05 PM

పాల్వంచ త్రివేణి పాఠశాలలో అంబరాన్నంటిన గ్రాడ్యుయేషన్ వేడుకలు

పాల్వంచ,(విజయక్రాంతి) స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలోజరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో మామిడి తోరణాలతో అందమైన రంగవల్లులతో అలంకరించారు. తరువాత పాఠశాల ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి  ఆధ్వర్యంలో పాఠశాల ప్రైమరీ ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జి.నరసింహ కుమార్ ,డాక్టర్ ఎన్విఎన్ ప్రభాస్ హాజరయ్యారు. 

వేదిక వద్ద ఏర్పాటుచేసిన దేవతా విగ్రహాలకు పూలమాలంకరణ చేసి పూజాదికాలు నిర్వహించారు. విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ను వారికి అందజేశారు. ఆపై చిన్నారులు చేసిన నృత్యం వచ్చిన అందరిని అలరింప చేసింది. తర్వాత ఒక్కొక్కరిగా వారి  ప్రసంగాలను కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ శ్రీ గొల్లపూడి వీరేంద్ర చౌదరి సీఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ  పిల్లలను ఉద్దేశించి ప్రత్యేక శుభాకాంక్షలు అందజేయగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి, కిడ్స్ ఇంచార్జ్, శ్రీమతి కవిత పాల్గొన్నారు.