29 August, 2026 | 4:40 AM

ధర్మానికి అసలైన పరమార్థం రాఖీ

29-08-2026 02:34 AM
  1. భద్రత, విజయాన్ని కాంక్షించే గొప్పదేశం భారత్
  2. రక్షాబంధన్ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): భారతీ య సనాతన సంస్కృతిలో అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల పవిత్ర అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు అన్నారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తు సైనికులకు కూడా దేశవ్యా ప్తంగా మహిళా సోదరీమణులు రాఖీలు కడుతున్నా రని హర్షం వ్యక్తంచేశారు. రక్షాబంధన్ రోజున సైనికుల భద్రతను, విజయాన్ని కాంక్షించే గొప్ప సంప్రదాయం మనదేశంలో ఉందన్నారు.

దేశానికి, ధర్మానికి రక్ష అనే ఉన్నతమైన భావనే రక్షాబంధన్‌లోని అసలైన పరా మర్థమన్నారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి అధ్యక్షతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాఖీ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా వేడుకల నిర్వహణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రధా ని నరేంద్ర మోదీ అత్యున్నత ప్రాధాన్యతని స్తున్నారని కొనియాడారు.

కోట్లాది మందికి ‘పీఎం ఉజ్వల యోజ న, పీఎం మాతృ వందన యోజన’ ద్వారా ఆర్థిక, ఆరోగ్య భరోసా కల్పించారని చెప్పారు. చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, ఇండి కూటమిపార్టీలు అడుగడుగు నా అనేక కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిం చాయని మండిపడ్డారు. డీలిమిటేషన్‌తో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అధికస్థానాలు లభించడాన్ని చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదని మండిపడ్డారు. మరోవైపు రాహుల్‌గాంధీ మహిళలను కించపరిచేలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని ఆలింగనాలను కూడా వెకిలిగా ప్రదర్శించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కంగనారౌనత్, రాష్ట్రపతిపై కూడా అవమానకర వ్యాఖ్య లను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. తెలంగాణ లోని మహిళా లోకానికి బీజేపీ ఎళ్లవేళలా రక్షణగా, తోడుగా ఉంటుందన్నారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాళ్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.