సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి: సీఐ ధనుంజయ్ గౌడ్
ఉప్పల్,(విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని కేటుగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకోవాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. మల్లాపూర్ గోకుల్ నగర్ లోని సైబర్ నేరాలపై సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తో కలిసి కాలనీవాసులతో అవగాహన సదస్సును ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నెరగాళ్లు ఫోన్ కాల్స్ ఫేక్ లింకులు ఓటీపీ సోషల్ మీడియా హాకింగ్ వంటి పద్ధతి ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అపరిచిత వ్యక్తిల నుండి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజెస్ లింక్స్ ను ఎవరు నమ్మవద్దని సూచించారు. వృద్ధులే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకులో ఉన్న నగదు తస్కరించేందుకు ఓటిపి ల పేర్లతో ఫోన్ కాల్ చేస్తూ ఉంటారని ఇవేవీ కూడా నమ్మకుండా జాగ్రత్త వహించాలని ఆయనకు సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1 9 3 0 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు






