13 May, 2026 | 8:13 PM

ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

13-05-2026 07:27 PM

ముకరంపుర,(విజయక్రాంతి): బుధవారం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా కార్యవర్గ సభ్యులు  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు డిప్యూటీ మేయర్ ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు  నూతన ఆటో కార్మిక సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులను అభినంది శాలువాతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సంఘం ముఖ్య నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బండారి సంపత్  పాల్గొన్నారు.