13 May, 2026 | 8:12 PM

వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేయాలి

13-05-2026 07:29 PM

మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించిన సిపిఎం, తెలంగాణ రైతు సంఘం నాయకులు

కూసుమంచి,(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సిపిఎం తెలంగాణ రైతు సంఘం నాయకులు  వినతి పత్రం అందజేశారు. బుధవారం మండలంలోని జీళ్ళ చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డికి రైతుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

మండల వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంటలను కొనుగోలు చేయాలని మండలానికి అధిక లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలని, గోడౌన్స్ దగ్గర హమాలీల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ గోడౌన్స్ లేని పక్షంలో కళ్యాణ మండపాలు, పాత ఇండస్ట్రియల్ ను  ప్రభుత్వం అద్దెకు తీసుకొని, రైతుల ధాన్యం తరలించాలని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల వ్యవధిలోనే రైతులకు కు డబ్బులు జమ చేయాలని మా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు, తెలంగాణ రైతు సంఘం పాలేరు  డివిజన్ అధ్యక్షులు బిక్కసాని గంగాధర్, కేశవపురం గ్రామ సిపిఎం కార్యదర్శి బెల్లం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు రూప్లా నాయక్, కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు