ఇండ్ల గణన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
* కుర్తివాడలో జనగణన 2027ను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
పాపన్నపేట: జనగణన 2027లో భాగంగా ఇండ్ల గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని కుర్తివాడలో కొనసాగుతున్న ఇండ్ల గణన ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండ్ల గణన ప్రక్రియను అధికారులు నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఇండ్ల జాబితా బ్లాక్ లలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. జనగణన గృహ జాబితా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిసిపిఓ జనగణన అధికారులు, ఎన్యుమరేటర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






