విపక్ష సభ్యుల తీరు సిగ్గుచేటు
బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి అన్నారు. బుధవారం తన ఛాంబర్ లో మాట్లాడారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సమక్షంలో స్థానిక పద్మశాలి ఫంక్షన్ హాల్ లో అర్హులైన నిరుపేదలకు లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూం కేటాయింపు పూర్తి చేసామన్నారు. ఈ లక్కీ డ్రా ద్వారా లబ్ది పొందిన వారికీ ముందుగా శుభాకాంక్షలు చెప్పారు.
అర్హులై ఉండి డబుల్ బెడ్ రూమ్ రాని వారు ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ళు పథకం ద్వారా నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నాతన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించడం జరుగుతుందన్నారు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు తహసిల్దార్, పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది లబ్దిదారుల ముంగిట పూర్తి పారదర్శకంగా జరుగిందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కావాల్సికొని రాజకీయ లబ్ధి కోసం గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.. రాజకీయ లబ్ధి కొరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులను ఇబ్బంది పెట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రయత్నించిన తీరు సిగ్గుచేటు అన్నారు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు విషయంలో ఎవరైనా ఇప్పటికే దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి ఉంటే వెంటనే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకోండినీ చెప్పారు..ఎవరైనా దళారులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మా ద్రుష్టికి తీసుకువస్తే సహాయం అందిస్తామని పేర్కొన్నారు.






