13 May, 2026 | 8:12 PM

పట్టాలపై ఆగిపోయిన లారీ.. పలు రైళ్లు ఆలస్యం

13-05-2026 07:17 PM

బోధన్,(విజయక్రాంతి): నవిపెట్ మండలంలో  మిట్టాపూర్ రైల్వే గేట్ మధ్యలో వడ్ల లారీ ఇరుక్కుపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో నాగావళి సూపర్ ఫాస్ట్, కాచిగూడ–పూర్ణ డెమో రైళ్లు నవీపేట్, బాసర స్టేషన్ల వద్ద నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ట్రాక్టర్ల సాయంతో లారీని పట్టాల పైనుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టారు.

దీంతో రైళ్ల రాకపోకలు యథాతథంగా సాగాయి. వరి కొనుగోలు సమయంలో ఓవర్లోడు లారీలను రైల్వే బ్రిడ్జి నుండి కాకుండా వేరే మార్గంలో వెళ్లే రకంగా చూడాలని రైల్వే అధికారులు సూచించారు. ఓవర్ లోడ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. దీని పట్ల నిర్లక్ష్యం వస్తే తగు చర్యలు తీసుకుంటామని నవిపేట్ రైల్వేస్టేషన్ మాస్టర్ తెలిపారు.