13 May, 2026 | 8:37 PM

చింతమడకలో మహంకాళి విగ్రహ పునఃప్రతిష్ఠకు ఘనంగా ఏర్పాట్లు

13-05-2026 07:34 PM

పోచమ్మ, మహంకాళి బోనాలు.. గావు పట్టుటతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు దుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల సందర్భంగా గ్రామంలో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు, మహంకాళి బోనాలు, గావు పట్టుట వంటి సంప్రదాయ ఉత్సవాలు జరగనున్నాయి.

ఈ ఉత్సవాలతో చింతమడక గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఆలయాల వద్ద ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాసిరెడ్డి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో బైరీ నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ హంసాకేతన్ రెడ్డి, వట్టిపల్లి నాగిరెడ్డి, కాసిరెడ్డి అమరేందర్ రెడ్డి, బైరీ జైపాల్ రెడ్డి, బెంజరం రవీందర్ రెడ్డి, కాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.