13 May, 2026 | 7:50 PM

లక్కీ డ్రాతో 108 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు

13-05-2026 06:50 PM

- లక్కీ డ్రాలో పాల్గొన్న సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి

- లక్కీ డ్రాను బహిస్కరించిన విపక్షాలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ సుఖాంతమైంది. లక్కీ డ్రా తో చేపట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విపక్ష కౌన్సిలర్ల  నిరసనల మధ్య పూర్తయ్యింది. పట్టణంలోని పద్మశాలి భవనంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి సమక్షంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టారు. నిర్మాణం పూర్తి అయిన 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తొలుత 496 మంది అర్హులను ఎంపిక చేశారు.

ఇందులో ఇండ్ల పంపిణీ కోసం చేపట్టిన లక్కీ డ్రా లో 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రా ద్వారా వారికి ఇళ్ళను కేటాయించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దామస్వతి సబ్ కలెక్టర్ మనోజులు ఈ మేరకు లక్కీ డ్రా తీసి ఇళ్ల ను అర్హులైన లబ్ది దారులకు కేటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు 763 మంది దరఖాస్తులు చేసుకొన్నారని తెలిపారు. 496 మందితో అర్హుల జాబితాను తయారు చేసినట్టు తెలిపారు.

ఇండ్ల పంపిణీ ఎస్సీలు 158 మందికి గాను 18, ఎస్టీలు 11 మందికి ఆరుగురుకి, మైనార్టీలు 91 మందికి 13, బీసీ అండ్ బ్రదర్స్ 236 మందికి గాను 71 మందికి  లక్కీ ద్వారా లక్కీ డ్రాతో  108 మందికి డబుల్ బెడ్రూం కేటాయించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. 496 మంది లబ్ధిదారుల ముందే లక్కీ డ్రా నిర్వహించి 108 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు. ఇండ్లు రాని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి హామీ ఇచ్చారు. లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని బాధపడద్దన్నారు.

ఇండ్ల పంపిణీ నీ కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది సరైనా పద్దతి కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తహసిల్దార్ లవ్డీయా కృష్ణ, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, డిప్యూటీ తాసిల్దార్ హమీద్, మున్సిపల్  కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని బీఆర్ ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. లక్కీ డ్రాను బహిష్కరించిన బీ ఆర్ఎస్ కౌన్సిలర్లు బయటికి వెళ్ళిపోయారు.