వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి
20-07-2026 07:48 PM
8 వార్డు కౌన్సిలర్ కోలా ఉదయభాను
హుజుర్ నగర్: వర్షపు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ కోలా ఉదయభాను ఉపేందర్ అన్నారు.సోమవారం పట్టణంలోని గోవిందపురం8 వార్డులో ఇంకుడు గుంతలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలుఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని చేసుకోవాలన్నారు.భూగర్భ జలాల పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.వర్షపు నీటిని ఒడిసిపడితేనే భూగర్భ జలాలు మెరుగుపడ తాయన్నారు.






