5 August, 2026 | 1:54 AM

వానలు కురిసే..రైతులు మురిసే..

05-08-2026 12:00 AM

ముస్తాబాద్,జూలై 4( విజయక్రాంతి)ఆలస్యమైనా విస్తారంగా వర్షాలు కురవడంతో వరి నాట్లు జోరు అందుకున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తం గా నాట్లు వేసేందుకు రైతులు బిజీ అయ్యా రు. మొన్నటి వరకు పూర్తిగా ఎండిపోయిన పోతుగల్ గ్రామంలోని ఎల్లమ్మ వాగు ఇప్పు డు నిండుగా ప్రవహిస్తుంది. భూగర్భ జలా లు పెరిగాయి.

బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉంది.ఎల్ నినో కారణంగా ఈ యేడు వర్షాలు పడతాయో పడయో?అని భయపడ్డాం కానీ వరుణ దేవుడు కరుణించి వర్షా లు కురవడంతో ఆనందంగా ఉందని, వా నలు కురిసే-రైతులు మురిసే..అంటూ యువ రైతు బొల్లె హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులంతా వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా నిమగ్నమయ్యారు.