6 June, 2026 | 5:42 PM

Breaking News

కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •   బోడులో ఖేతి బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహణ   •  

హైదరాబాద్‌లో భారీ వర్షం

06-06-2026 04:24 PM

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో వాన

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండకొట్టిన సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బొరబండ, యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, టోలీచౌకి, షేక్ పేట్, గచ్చిబౌలి, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, అమీర్ పేట్ తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. హైదర్ గూడ, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది.

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

తెలంగాణలో పలు జిల్లాలో శనివారం సాయంత్రం వర్షం పడుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జోరుగా వర్షం కురిసింది. వర్షం ధాటికి తాండూర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఒక భారీ చెట్టు విరిగిపడింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.