27 February, 2026 | 10:13 PM

Breaking News

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన రైల్వే మెగా సాధన కమిటీ

27-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అధికంగా గిరిజన జనాభా కలిగి, ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని యువత, నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని, ఈ ప్రాంతంలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మెగా మెయింటెనెన్స్ డిపో సాధన కమిటీ సభ్యులు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన రైల్వేబోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మెగాడిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగానే ఇస్తున్నట్లు ప్రతిపాదనలు అందాయన్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, డిపో సాధన కమిటీ బాధ్యులు డాక్టర్ డోలి సత్యనారాయణ, మైస శ్రీనివాసులు, బీజేపి మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, రజక సంఘం నాయకులు దుగ్గి గోపాల్, టిపిజేఏసి నాయకులు బుర్ర గోవర్ధన్ లు పాల్గొన్నారు.