కాంగ్రెస్ పరాన్నజీవి
- ఒకరి మీద ఆధారపడడమే ఆ పార్టీ నైజం
- అధికార దాహంతో డీఎంకేకు రిక్తహస్తం
- ఆ పార్టీ ఓటమి చూసి టీవీకే పంచన అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ మిత్రపక్షాలకు వెన్నుపోటు ప్రాంతీయ పార్టీలూ బహుపరాక్
- కర్ణాటకలో సుపరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
- బెంగళూరులో కాషాయ సూర్యోదయం
- బెంగళూరు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ
- టీవీకే అధినేత విజయ్‌కి మోదీ శుభాకాంక్షలు
బెంగళూరు, మే 10: కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అని ప్రధాని మోదీ విమర్శించారు. డీఎంకేని వాడుకుని, తీరా ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చూసి, టీవీకే పంచన చేరిందని మం డిపడ్డారు. మూడు దశాబ్దాలుగా సంక్షోభ సమయాల్లో ద్రవిడ మున్నేట్ర కజగం పదేపదే మద్దతు తెలిపినప్పటికీ, కాంగ్రెస్ ‘అధి కార దాహం’తో డీఎంకేకు వెన్నుపోటు పొడిసిందన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీ తన మిత్రపక్షాలను నిర్ధాక్షణ్యంగా వదిలేస్తోందని, కావున ప్రాంతీయ పార్టీలూ బహుపరాక్ అని, కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు.
తర లి వచ్చిన బీజేపీ సైన్యాన్ని చూసి బెంగళూరు నుంచి ‘కాషాయ సూర్యుడు’ ఉదయిస్తున్నాడని అన్నారు. కర్ణాటకలో సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఒక ‘పరాన్నజీవి’ పార్టీగా ఆయన అభివర్ణించారు. అవకాశం దొరికినప్పుడల్లా తన మిత్రపక్షాలకు ఆ పార్టీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు.
తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హె చ్చరించారు. యూపీఏ ప్రభుత్వ హయాం లో పదేళ్లపాటు డీఎంకే కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని మోదీ గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయాల్లో డీఎంకే ఎంతో సాయం చేసిందని పేర్కొన్నారు.
అయితే అధికారం కోసం కాంగ్రెస్ ఇప్పు డు డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. తమిళనాడులో తన ఉనికిని కాపాడుకోవడానికి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాం గ్రెస్ ఆశ్రయం ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఒకరి మీద ఆధారపడి బతకడమే ఆ పార్టీ నైజమన్నారు. కర్ణా టక ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి పంపకాలపైనే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కుర్చీలాటలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. కేరళంలో కూడా సీఎం ఎంపికపై కాంగ్రెస్ లో గందరగోళం నెలకొందని విమర్శించా రు. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ అబద్ధాలని ప్రజలు గుర్తించారని మోదీ కోరారు. వివిధ రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ పాలనా విధానానికి నిదర్శన మని అన్నారు. పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలను మోదీ ప్రస్తా వించారు. ఈ ఫలితాలు దేశంలో ఒక నిర్ణయాత్మక రాజకీయ మార్పును సూచిస్తు న్నాయని స్పష్టం చేశారు.
టీవీకే అధినేత విజయ్‌కి శుభాకాంక్షలు
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజ య్‌కి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేం ద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సం క్షేమం కోసం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సామాజిక మాధ్యమాల వేదికగా మోదీ అభినందనలు తెలియజేశారు.






