తమిళనాట నవశకం
ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని కాదని టీవీకే అధినేత విజయ్ ఆదివారం అధికార పీఠానెక్కారు. తను దైవాంశ సంభూతుడిని కానని.. ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చానని ఈ సందర్భంగా కొత్త సీఎం విజయ్ అన్నారు. హామీలు నెరవేర్చేందుకు తనకు కొంత సమయమివ్వాలని విజ్ఞప్తి చేశారు. గత డీఎంకే ప్రభుత్వం ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిందని, సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నవశకం ఆరంభమైంది !
- నేను దైవాంశ సంభూతుడిని కాను సామాన్యమైన మనిషిని.. మీ సోదరుడిని
- ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చా
- ప్రజల ఆకాంక్షలు తెలుసు.. కానీ, రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను
- గత డీఎంకే ప్రభుత్వం ౧౦ లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది
- కాస్త గడువిస్తే అన్నీ చక్కదిద్దుతాను: తమిళనాడు నూతన సీఎం విజయ్
- తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్
- ౨౦౦ యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎం తొలిసంతకం
- డ్రగ్స్ రహిత రాష్ట్రం, మహిళా భద్రత ఫైళ్లపై తర్వాతి సంతకాలు
చెన్నై, మే ౧౦: ‘తమిళనాడులో నవశకం ఆరంభమైంది. లౌకిక, సామాజిక న్యాయ శ కం మొదలైంది. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ముఖ్యమంత్రినైన నేను మీ వాడిని. మీ సోదరుడిని. మీ కుమారుడిని. నేనేమీ దైవాంశ సంభూతుడిని కాను. మీలా నాది కూడా సా ధారణ జీవితమే. ఎనిమిది కోట్ల మంది నా వెంటే ఉన్నారు. ఆ ధైర్యంతో నేను అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలను. ఎన్నో కష్టాల ను అధిగమించి ఈ స్థాయికి వచ్చా.
నేనొక సినీ దర్శకుడి కుమారుడిని. మీ ఆకాంక్షలు నాకు తెలుసు. కానీ.. నాకు కొంత సమయమివ్వండి. రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టిం చలేను. గత డీఎంకే ప్రభుత్వం ఖజానా మొ త్తాన్ని ఖాళీ చేసి వెళ్లింది. సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చింది. భరించలేనంత ఆర్థిక భారాన్ని మోపింది. అవసరమైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత ప త్రం విడుదల అంశాన్నీ పరిశీలిస్తాం. మా ప్రభుత్వం సాధ్యమయ్యేదే చెబుతుంది.. చెప్పిందే చేస్తుంది’ అంటూ టీవీకే అధినేత, తమిళనాడు నూతన సీఎం విజయ్ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. చెన్నై నగ రంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ముఖ్యమంత్రి, మం త్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వేదికపై విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేయించారు. ముఖ్యమంత్రిగా విజయ్ ౨౦౦ యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉచితం ఫైల్‌పై సంతకం చేశారు. తర్వాత డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ‘యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్’, మహిళల భద్రత కోసం ‘సింగ పెణ్’ ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ము ఖ్యమంత్రి విజయ్ ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణకు చోటు లేద ని విజయ్ స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో తానొక్కడినే అధికార కేంద్రంగా ఉంటానని ఆయన నొక్కి చెప్పారు. తాను ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పైసానైనా తిననని, తాను ఏ తప్పూ చేయనని ప్రతినబూనారు. ప్రభుత్వ నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తానని ప్రమాణం చేశారు. అవినీతికి తావులేని పాలన సాగిస్తానని స్పష్టంచేశారు.
ప్రజల సొమ్ముతో ఎవ రినీ కోటీశ్వరులు కానివ్వనని పేర్కొన్నారు. తానొక్కడే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా అవినీతికి పాల్పడనివ్వనని ప్రకటించారు. తన పార్టీలో, ప్రభుత్వంలో ఎవరైనా గెలిచేశాం కదా.. ఇక దోచుకుందామనే ఆలోచన ఉన్నవారు, వెంటనే ఆ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. తనను విమర్శించి, అవమానించిన వారు కూడా తన ప్రజలేనని అభివర్ణించారు. శత్రువైనా, మిత్రుడైనా తమ ప్రభుత్వంలో ఒక్కటేనని వివరించారు.
విద్యార్థుల భవిష్యత్తు తనకెంతో ముఖ్యమని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ‘విజయ్ మామ మీకు మెరుగైన విద్య అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాను’ అంటూ వ్యాఖ్యానించారు. టీవీకే విజయంలో కార్యకర్తలపాత్ర ఎంతోఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, వామపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రుల ప్రమాణం ఇలా..
సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వరుసగా ‘బుస్సీ’ ఎన్.ఆనంద్, ఆధవ్ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టయన్, పి.వెంకటరమణన్, సీటీఆర్ నిర్మల్‌కుమార్, ఎ.రాజ్‌మోహన్, టీకే.ప్రభు, ఎస్.కీర్తనతో ప్రమాణం చేయించారు. క్యాబినెట్‌లో అత్యంత పిన్నవయస్కురాలు ఎస్.కీర్తన. ఆమె వయస్సు కేవలం 29 ఏళ్లు. అలాగే, క్యాబినెట్‌లో అత్యంత వయస్కుడు కేఏ సెంగొట్టయన్, వయస్సు 78 ఏళ్లు.
తల్లిదండ్రుల భావోద్వేగం
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ ‘మా కుమారుడు సీఎంగా ప్రమాణం చేయడం చూసి నేనెంతో గర్వపడుతున్నా’ అని చెప్పారు. అలాగే తల్లి శోభ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘మాతృ దినోత్సవం రోజే మాఅబ్బాయి సీఎం పీఠా న్ని అధిష్ఠించడం నాకు దక్కిన గొప్ప కానుక’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
జాతీయ గీతం, గేయం, రాష్ట్ర గీతాలాపన
ప్రమాణ స్వీకారోత్సవ సభలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు విజయ్ గాయకులతో కలిసి ‘జనగణమన’ గేయం, ‘వందేమాతర’ గీతం, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించడం విశేషం. ముఖ్యంగా వందేమాతర గీతంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడడం అందరి దృష్టిని ఆకర్షిం చింది. సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతంలోని రెండు చరణాలను మాత్రమే గాయకులు ఆలపిస్తారు. కానీ, ఈ సభలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల గీతంలోని ఆరు చరణాలనూ ఆలపించాలని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, ఆ నిబంధనలను పాటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే బెంగాల్‌లో సీఎం సువేందు ప్రమాణ స్వీకారోతవ్సంలో ఈ గీతాలను పాడకపోవడం గమనార్హం.
సెల్ఫీలతో సందడి
ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం, మంత్రివర్గం గవర్నర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగాల్సి ఉందిం.దీంతో సిబ్బంది వేదికపై ఉన్న టేబుల్స్‌ను తొలగిస్తుండగా, విజయ్ కూడా వారికి సాయం చేస్తూ బల్లను మోశారు. అనంతరం విజయ్ తన అభిమానులు, ముఖ్యఅతిథులతో కలిసి సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తన మంత్రివర్గ సహచరులను కూడా ఈ వీడియోలో భాగం చేశారు. తర్వాత స్టేడియంలో ఉన్న అశేష జనవాహిని వైపు మొబైల్ తిప్పి అందరినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశాన్ని చూసి యావత్ స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.
ప్రత్యేక ఆకర్షణగా త్రిష
టీవీకే అధినేత విజయ్ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో సినీనటి త్రిషా కృష్ణన్ సందడి చేశారు. సభాప్రాంగణంలోకి వస్తూవస్తూనే తన ఫ్యాన్స్‌కు, వేడుకలకు తరలొచ్చిన జనానికి అభివాదం చేశారు. సాంప్రదాయ ప్రత్యే చీరకట్టులో ఆకట్టుకున్నారు. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌ను ఆమె ఎంతో ఆపాయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో త్రిషా కృష్ణన్ తన తల్లి ఉమాకృష్ణన్‌తో కలిసి వచ్చి ఉత్సాహంగా, ఉల్లాసంగా సందడి చేశారు.
విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించారు. తన సీటులో కూర్చోవడానికి వచ్చిన శోభను త్రిష ఆప్యాయంగా పలకరించారు. ముందు వరుసలో కూర్చునే ముందు ఇద్దరూ కొద్దిసేపు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా త్రిష, శోభ మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుక కోసం, త్రిష పోతీస్ వారి నీలి రంగు పట్టు కంజీవరం చీరను, దానికి జతగా లేత గోధుమ రంగు ఎంబ్రాయిడరీ బ్లౌజును ధరించారు. ఆమెకు ఏకా లఖానీ, హర్షేన్ రవిచందర్ స్టైలింగ్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి తాను ‘ఎదురుచూ స్తున్నా’ అని అంతకుముందు చెప్పింది. ఈ కార్యక్రమానికి విజయ్ కుటుంబ సభ్యులు, పార్టీ సహచరులు, సన్నిహితులు హాజరయ్యారు. విజయ్ ‘జన నాయగన్’ నిర్మాత కేఎల్ నారాయణ, గీత రచయిత వివేక్, నటుడు జై కూడా ఉన్నారు.






