11 May, 2026 | 4:56 AM

పక్కదారి పట్టిన మోదీ ప్రసంగం!

11-05-2026 03:40 AM
  1. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై నామమాత్రంగానే విమర్శలు
  2. పాలనా పరమైన అంశాలపై విమర్శల్లేవు
  3. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా వ్యూహత్మక అడుగు?
  4. జాతీయ కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే రేవంత్ ఊసెత్తకపోవడంతో అనుమానలకు తావు

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ఇటీవల దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అందులోనూ వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రంలో మొట్టమొదటి సారి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం ఆ పార్టీకి ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ క్ర మంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం మొదలైంది. అయి తే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తెలంగాణ గడ్డ మీద ప్రధాని నరేం ద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ప్రజ లు, బీజేపీ శ్రేణులు ఆయన ప్ర సంగంపై ఆసక్తిగా ఎదురుచూశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగేలా ఉంటుందని అంచనా వేశారు.

ప్రజలు, రాజకీయ వర్గాలు ఊహించినంత దూ కుడు మాత్రం మోదీ ప్రసంగంలో కనిపించలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తారని భా వించిన బీజేపీ శ్రేణులకు నిరా శే ఎదురైంది. సాధారణంగా ఎన్నికల వాతావర ణం దగ్గరపడుతు న్న సమయంలో ప్రధాని ప్రసంగా ల్లో ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు, పరిపా లన వైఫల్యాలపై నేరుగా దాడులు కనిపిస్తుంటాయి. కానీ ఈసారి మోదీ ప్రసంగంలో అలాంటి రాజకీయ వేడి పెద్ద గా కని పించ లేదు.

రాష్ట్ర ప్ర భుత్వ పనితీరు, హామీల అమ లు, రైతు సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై కూడా తీవ్ర విమర్శలు చేయకుండా జాగ్రత్త పడినట్టుగా కనిపించింది. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ప్ర ధాని.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పరిపాల నపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేయకపోవడం అత్యంత ఆసక్తిక రంగా మారింది. సాధారణంగా రాష్ట్ర పర్యటనల సమయంలో స్థానిక నాయకత్వాన్ని నేరుగా టార్గె ట్ చేసే బీజేపీ వ్యూహానికి భిన్నంగా ఈసారి మోదీ వ్యవహరించారు.

దీనిపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమ వుతు న్నాయి. భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోందా? రాష్ట్రంలో కాంగ్రెస్‌తో నేరుగా ఘర్షణకు వెళ్లకుండా... బీఆర్‌ఎస్ బలహీనతను గమనిస్తూ రాజకీయ ప్రభావం పెం చుకునే ప్రయత్నం చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయక త్వం ఆశించినంతగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాని టార్గెట్ చేయకపోవడం కూడా పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది.

రైతు రుణమాఫీ, హామీ ల అమలు, విద్యుత్, సాగునీటి అంశాలపై దాడి ఉంటుందని భా వించిన కార్యకర్తలు... ప్రసంగం మరీ మృదువుగా సాగిందని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం దీనిని వ్యూహాత్మక రాజకీయంగా సమర్థిస్తున్నాయి. జాతీయ అంశాల పై ఫోకస్ పెడుతూ అభివృద్ధి, కేంద్ర పథకాల అమలుపై ఎక్కువగా మాట్లాడటం ద్వా రా ప్రజల్లో సానుకూలత పెంచే ప్రయ త్నం చేశారని చెపుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ అసలు రాజకీయ దాడులు ప్రారంభమవుతాయని అంటున్నాయి.

ఇదిలా ఉండగా మోదీ ప్ర సంగం తక్షణ రాజకీయ దాడికంటే, దీర్ఘకాల వ్యూహానికి సంకేతంగా కనిపిస్తోందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరులో బీజేపీ తన స్థానం ఎలా బలపరుచుకోవాలన్న దానిపై వ్యూహాలు ర చిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.