27 February, 2026 | 11:55 PM

Breaking News

దేవాలయంపై నమాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్

27-02-2026 12:00 AM

ఆలయం వద్ద పోలీసు బందోబస్తు

మేడిపల్లి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మల్కాజిగిరి కమీషనరేట్, పోచారం డివిజన్ పరిధి ప్రతాపసింగారంలోని అయ్యప్ప దేవాలయం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చేస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి మేడిపల్లి పోలీసులకు  అప్పగించారు.

స్థానిక నాయకుడు బద్దం కుమార్ ఫిర్యాదు మేరకు ఆవ్యక్తి పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గురువారం ప్రతాపసింగారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అయ్యప్ప దేవాలయం, పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.