బీఆర్ఎస్కు షాక్ .. సుప్రీంలో ముగిసిన పార్టీ ఫిరాయింపుల కేసు
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల(MLA Defection Case) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ ముగించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్లను స్పీకర్ పరిష్కరించినట్లు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం వెలువరించారని సింఘ్వీ పేర్కొన్నారు.
పెండింగ్ లో ఉన్న ఇద్దరిపై నిన్న తుదితీర్పు ఇచ్చినట్లు సింఘ్వీ వెల్లడించారు. సుప్రీంకోర్టలో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని సింఘ్వీ సూచించారు. స్పీకర్ న్యాయవాది సింఘ్వీ(Singhvi) వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని కోర్టు సూచించింది. జస్టిస్ కరోల్ ధర్మాసనం విచారణ ముగిసినట్లు ప్రకటించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నాడు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.




