27 June, 2026 | 1:52 AM

ఉట్టిపడిన మతసామరస్యం

27-06-2026 12:41 AM

 భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

పాపన్నపేట,జూన్26: మండల కేంద్రం పాపన్నపేటతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో  శుక్రవారం మొహరం పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మతసామరస్యం ఉట్టిపడేలా హిందూ, ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పీర్లు రెండు కలిసి ఒక్కటయ్యే ఘట్టాన్ని భక్తి పారవశ్యంతో భక్తులు తిలకించారు.