డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. జీవితానికి ‘ఎస్’ చెప్పండి
జిల్లా ఎస్పీ జానకి
జడ్చర్ల, జూన్ 26: డ్రగ్స్ కు కరాకండిగా నో చెబుతూ మంచి జీవితానికి స్వాగతం పలకాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 26ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్ములన, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు.
మాదకద్రవ్యాలు వ్యక్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాల ఆనందాన్ని, యువత భవిష్యత్తును, సమాజ శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీసే సామాజిక శాపమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్, సీఐలు కమలాకర్, నాగార్జున, ఎస్త్స్రలు మల్లేష్, ఖాదర్, జయప్రసాద్, పోలీసు సిబ్బంది, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.






