27 June, 2026 | 3:06 AM

రోల్లవాగును పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే

27-06-2026 01:48 AM

బీర్ పూర్, జూన్ 26 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోల్ల వాగును సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కు మార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూరోల్ల వాగు గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా వాగులో ఉన్న మట్టి, చెత్త, పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.