17 July, 2026 | 8:06 PM

Breaking News

రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఓటే ప్రజాస్వామ్యానికి పునర్జీవం   •  

కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్

10-05-2026 12:21 AM
  1. మూడు కార్లు, బైక్ దగ్ధం 
  2. భయాందోళనలతో పరుగులు పెట్టిన స్థానికులు
  3. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఘటన
  4. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం సీఎన్జీ కారులో గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. దీంతో మూడు కార్లు, ఒక బైక్ దగ్దమయ్యా యి. పట్టణంలోని దేవునిపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాం తంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

స్థానికులు అగ్ని మాపక శాఖ అధికారుల కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఎంతో శ్రమించి మంటలను ఆర్పి వేశారు. సిఎన్జి గ్యాస్ కారులో గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కారులోని గ్యాస్ సిలిండర్ వెళ్లడంతో పక్కనే ఉన్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సందర్శించారు.