17 July, 2026 | 8:05 PM

మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు

17-07-2026 07:51 PM

ఐదుగురిపై కేసు నమోదు

ముగ్గురు అరెస్ట్ – ఇద్దరు పరారీ

మూడు స్ట్రిప్స్ టాపెంటాడాల్ టాబ్లెట్లు, రెండు సిరంజీలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం

ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత టాపెంటాడాల్ (Tapentadol) నొప్పి నివారణ మాత్రలను మత్తు పదార్థంగా వినియోగిస్తూ, అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. జూలై 16న సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని ఈద్గా (EGDA) కేబీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో నిందితులు టాపెంటాడాల్ మాత్రలను సిరంజీల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

దర్యాప్తులో ఎలాంటి సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్ట్ A-5 కదం @ కదం శేఖర్ అక్రమంగా టాపెంటాడాల్ మాత్రలను విక్రయిస్తున్నారు.A-1 చవాన్ @ చౌహాన్ నిఖిల్ రాజ్ @ నిఖిల్, A-2 పొడేటి @ పొడేటి వంశీ కృష్ణ, A-3, A-4లు వాటిని తెలిసి కొనుగోలు చేసి మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైందని అన్నారు. ఈ కేసులో A-1 చవాన్ @ చౌహాన్ నిఖిల్ రాజ్ @ నిఖిల్, A-2 పొడేటి @ పొడేటి వంశీ కృష్ణ, A-5 కదం @ కదం శేఖర్లను అరెస్ట్ చేయగా, A-3, A-4 పరారీలో ఉన్నట్లు ఏ ఎస్ పి  వివరించారు.

నిందితుల వద్ద నుంచి మూడు స్ట్రిప్స్ నిషేధిత టాపెంటాడాల్ టాబ్లెట్లు, రెండు సిరంజీలు, ఒక Apple మొబైల్ ఫోన్, ఒక Vivo మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీపై తెలిపారు. ఈ సంఘటనపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను ఉట్నూర్ నాయస్థానం ఎదుట హాజరు పరచడం జరిగిందని అన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఏ.ఎస్.పి తెలిపారు. ఈ దాడులు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే పర్యవేక్షణలో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ ఆధ్వర్యంలోఎస్ఐ విజయ్ మరియు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు.