20 June, 2026 | 3:27 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

20-06-2026 12:57 AM

3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎం. ఏ హకీమ్

బాన్సువాడ, జూన్ 19 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ హకీం అన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మూడో వార్డు పరిధిలోని కొయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సరస్వతి పూజ,సామూహిక అక్షరాభ్యాసం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ హకీం హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు.

విద్యార్థులకు చిన్నప్పటి నుండే ఫోన్లు ఇతరత్రా వాటిపై దృష్టి పెట్టకుండా ఉన్నతమైన విద్యను అందించి వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన పేర్కొన్నారు. భావితరాలకు విద్యార్థులే ముఖ్యమని విద్యార్థులకు మంచి బోధన చేపట్టాలని ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన భోజనాన్ని కూడా విద్యార్థులకు అందే విధంగా చూడాలని ఆయన సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.