22 April, 2026 | 1:32 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బాలికలకు క్వాలిజీల్ పరిశుభ్రత కిట్ పంపిణీ

09-03-2026 11:19 PM

ఏఐ -ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్ మహిళా వారం 2026 వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా భాగంగా 'టుగెదర్ ఫర్ టుమారో' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వెనుకబడిన వర్గాల కు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్‌లను క్వాలిజీల్ పంపిణీ చేసింది.  ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం 'గివ్ టు గెయిన్' కు ప్రత్యక్ష వ్యక్తీకరణ గా ఈ కార్యక్రమం నిలిచింది. 

పంపిణీ చేయబడిన ప్రతి కిట్‌లో ప్రీమియం-నాణ్యత గల శానిటరీ ప్యాడ్‌లు, కాటన్ ఇన్నర్‌వేర్, ఫెమినైన్  వాష్, వెట్ వైప్స్, బయోడిగ్రేడబుల్ డిస్పోజల్ బ్యాగ్‌లు, ఒక చిన్న టవల్ , టూత్ బ్రష్ మరియు టూత్‌పేస్ట్ ఉన్నాయి - గౌరవం, శ్రేయస్సు , నిరంతరాయంగా పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి ఇవి  ముఖ్యమైనవిగా క్వాలీజీల్ పేర్కొంది. క్వాలిజీల్ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

ఋతుక్రమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించేందుకు విద్యావేత్తలను దీనిలో భాగం చేశారు. ఈ కార్యక్రమం గురించి క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు & ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి రోనాంకి మాట్లాడుతూ, “గివ్ టు గెయిన్’ అనే నేపథ్యం క్వాలిజీల్‌ వద్ద  తాము నిలబడే ప్రతి అంశంలోనూ లోతుగా ఉంటుందన్నారు. ఈ రోజు యువతుల ఆరోగ్యం, గౌరవం, విశ్వాసం పెంపొందించటానికి మనం తోడ్పాటు అందిస్తున్నప్పుడు, బలమైన, మరింత సమానమైన రేపటికి పునాది వేయగలమన్నారు.