జగిత్యాల కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసు..
ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరారీ
కోరుట్ల/జగిత్యాల, జూలై 16 (విజయక్రాంతి): జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిని జగిత్యాల టౌన్ పోలీస్ట్‌లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 8న మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
జగిత్యాల పట్టణంలోని తులసి నగర్‌కు చెందిన సమీండ్ల రాజేష్, సమీండ్ల గంగరాజు వారి తాత పేరుపై ఉన్న ఆస్తికి పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకునే ఉద్దేశంతో, డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్ విద్యానగర్, చెందిన వ్యక్తి సహకారంతో మున్సిపల్ అసెస్మెంట్ సర్టిఫికెట్‌పై కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణ లున్నాయి. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుధాకర్ దర్యాప్తు చేపట్టి సమీండ్ల రాజేష్, దిండిగల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు. మరొకరు సమీండ్ల గంగరాజు పరారీలో ఉన్నాడు.






