17 July, 2026 | 12:30 AM

ఆదుకున్న కోహ్లీ, శ్రేయాస్

17-07-2026 12:06 AM
  1. భారత్ 233 ఆలౌట్
  2.   55 రన్స్ తేడాలో 7 వికెట్లు
  3. నిరాశపరిచిన కీలక బ్యాటర్లు

కార్డిఫ్, జూలై 16 : రెండో వన్డేలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (31) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. గిల్ ఔటైనా కోహ్లీ (60), రోహిత్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. దీంతో ఓ దశలో టీమిండియా 104/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ రోహిత్ శర్మ ఔట్ కావడంతో కీలక భాగస్వామ్యానికి తెరపడింది.

శ్రేయస్ అయ్యర్ (66), విరాట్ కోహ్లీ(65) హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా 178/3తో కోలుకుంది. అప్పటికే కేవలం 31 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో భారత్ ఈజీగా 300 రన్స్ చేసేలా కనిపించింది. కానీ ఇక్కడే ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకున్నారు. .జోఫ్రా ఆర్చర్, మహమూద్ దెబ్బకు భారత మిడిలార్డర్ కుప్పకూలింది. విరాట్ కోహ్లీతో పాటు తొలి వన్డేలో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్లో చేతెల్తేశారు.

విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా (13 బంతుల్లో 20 రన్స్ నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీంతో టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3, గస్ అట్కిన్సన్ 3, సాకిబ్ మహమూద్ 2 వికెట్లు తీయగా.. సామ్ కర్రన్, విల్ జాక్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

టీమిండియా ఓ దశలో 104/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ తర్వాత అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. టీమిండియా తన చివరి ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింంది. తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ కూడా తడబడింది. కేవలం 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత రూట్, బ్రూక్ కాసేపు ఇన్నింగ్స్ కొనసాగించారు. కడపటి సమాచారం అందేటప్పటికి ఇంగ్లాండ్ ౪ వికెట్లకు ౧౦౦ పరుగులు చేసింది.