రూ.6400కే పూరి జగన్నాథ యాత్ర
03-03-2026 05:13 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో మార్చి 8 వ పూరి జగన్నాథ యాత్ర టీజీ ఆర్టీసీ సర్వీసు ఏర్పాటు చేసినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. అన్నవరం, సింహచలం, అర్సవెల్లి, కోణార్క్, పూరి జగన్నథ్, విశాఖపట్నం, ద్వారాకా తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి ఇది మంచి అవకాశం అన్నారు. సూపర్ లగ్జరి బస్సుకు పోను రాను (అప్ అండ్ డౌన్)కు కేవలం రూ.6400/-లకే 6 రోజుల యాత్ర ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలవారు నిర్మల్ బస్టాండ్ లో కాని మీ ఫోన్ ద్వారా కాని ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7382842582లో సంప్రదించాలని తెలిపారు.




