3 March, 2026 | 7:21 PM

ఎంఐఎం పట్టణ అధ్యక్షునిగా ముజాహిద్ అలీ

03-03-2026 05:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ ఎంఐఎం పార్టీ అధ్యక్షునిగా పట్టణంలోని కోరుకొండ చెందిన మాజీ కౌన్సిలర్ ముజాహిద్ హలీ ఎన్నికయ్యారు. ఎంఐఎం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఎంఐఎం అధ్యక్షులు అసవుద్దీన్ ఓవైసీ నాంపల్లి ఎమ్మెల్యే ముజీద్ హుస్సేన్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షులుగా అజీమ్ బిన్ అయ్యా అధ్యక్షుడిగా కొనసాగారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఓడిపోవడంతో సీనియర్ నాయకుడైన ముజాహిద్ అలీకి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు.

పార్టీని బలోపితం చేసినందుకు కృషి

నిర్మల్ పట్టణంలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పట్టణ నూతన అధ్యక్షులు ముజాహిద్ అలీ అన్నారు. మంగళవారం పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా పార్టీ అధిష్టానం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని వార్డులలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపితనికి కృషి చేస్తామన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు.

 ఎంఐఎం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఎంఐఎం అధ్యక్షులు అసవుద్దీన్ ఓవైసీ నాంపల్లి ఎమ్మెల్యే ముజీద్ హుస్సేన్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షులుగా అజీమ్ బిన్ అయ్యా అధ్యక్షుడిగా కొనసాగారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఓడిపోవడంతో సీనియర్ నాయకుడైన ముజాహిద్ అలీకి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు