3 March, 2026 | 8:41 PM

ఆయా గ్రామాల్లో జాగృతి పార్టీ గ్రామ అధ్యక్షులు ఎన్నిక

03-03-2026 05:18 PM

జాగృతి పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నాయకులు యువకులు పెద్ద ఎత్తున జాగృతి పార్టీలో చేరడం జరిగిందని మండల జాగృతి పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆయా గ్రామాల నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ పాల్గొన్నారు.

ఎండి ఫయీం మండల యూత్ ప్రెసిడెంట్గా, మండల వైస్ ప్రెసిడెంట్గా మన్నే విష్ణు ఎన్నుకోవడం జరిగింది. అలాగే మెల్లకుంట తండా గ్రామ అధ్యక్షులు విజయ్ కుమార్, మాల్తుమ్మెద గ్రామ అధ్యక్షులు బలరాం, చినుర్ గ్రామ అధ్యక్షులుగా బాతుల ప్రవీణ్, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు సుభాన్ రెడ్డి తెలిపారు. వారితోపాటు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, అధికార పార్టీ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్,మండల అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి, నాయకులు జాకీర్, సిద్ధిరాములు, మేకల పద్మ, జహీర్, మల్లారెడ్డి, సుదర్శన్, మన్మోహన్ రెడ్డి, యాదగిరి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.