8 May, 2026 | 2:48 AM

బండి.. రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్!

08-05-2026 01:43 AM
  1. కరీంనగర్‌లో శాంతిభద్రతలు విఫలం 
  2. బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలిపి తింటడు.. 
  3. అందుకే ఆయన వెంట్రుకలు ఊడిపోయినయ్
  4. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 

కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి  మాట్లాడుతూ.. కరీంనగర్ నడిబొడ్డున సీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. బండి సంజయ్ ఇంటికి దగ్గరలో జువెలరీ షాప్‌లో దొంగతనం జరిగి తే కేంద్రమంత్రిగా బండి సంజయ్ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు? ‘నీ నియోజకవర్గ కేంద్రంలో దొంగతనం జరిగితే పోలీసులతో సమీక్షించాల్సిన బాధ్యత నీపై లేదా? నీవు ప్రశ్నించాల్సింది రేవంత్ రెడ్డిని.. కానీ ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని ధ్వజమెత్తారు.

‘నీ భార్య మీది పుస్తెలు అమ్మి 2014 ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పావు.. మొన్నటి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టావు.. డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అవినీతి డబ్బులా? ఎక్కడినుండి వ చ్చాయో బయటపెట్టాలి’ అని బండి సం జయ్‌ని డిమాండ్ చేశారు. ‘నీకు దమ్ము ధైర్యం ఉంటే.. మొగోడివే అయితే, గీతా భవన్ చౌరస్తాలో నీతో చర్చకు సిద్ధం.. నువ్వు నా సవాలు స్వీకరిస్తే నేను.. కేటీఆర్‌ను తీసుకొని వస్తాను.. ఇరిగేషన్ పైన, సివిల్ సప్లై పైన, ఐటిపైన, హోం శాఖ పైన దేనిపైనైనా చర్చకు సిద్ధం’ అన్నారు.

‘ఏడు నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిం దో చెప్తాం.. చిల్లర మాటలు మాట్లాడకు.. అభివృద్ధిపై మాట్లాడు’ అన్నారు. ‘కేటీఆర్‌తో నీకు పోలిక ఏంటి.. కేటీఆర్‌ను విమ ర్శించే స్థాయి నీకు లేదు.. దమ్ముంటే సబ్జె క్టుపై మాట్లాడు.. చిల్లర విమర్శలు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు. ‘కరీంనగర్‌లో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలి చావా..? గంగుల కమలాకర్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది వాస్తవం కాదా? రెండుసార్లు ఎంపీగా నరేంద్ర మోదీ వేవ్‌లో గెలిచావు.

రాష్ట్రంలో ఉన్న అంద రూ ఎంపీలు, ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ చే యాలి.. ఇందుకు మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సిద్ధం.. దమ్ముంటే టెస్టులు చేయండి. నీవు తంబాకు డ్రగ్స్‌తో కలిపి తీసుకుంటున్నావు.. అందుకే సైడ్ ఎఫెక్ట్స్‌తో నీ తలపై వెంట్రుకలు ఊడిపోయాయి’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.

ఈనెల 5న అలుగునూరు చౌరస్తాలో యూపీకి చెందిన వాహనంలో దుండగులు వచ్చి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఖాలిద్‌ను బెదిరించి హత్య చేసే ప్ర యత్నం చేశారని, బాధిత న్యాయవాది పోలీసులను ఆశ్రయిస్తే.. పిటిషన్‌లో ఆ యుధాలు అనే పదాన్ని తీసేయమని బెదిరించారన్నారు. ‘ఆ న్యాయవాది హైకోర్టు ను ఆశ్రయించారు.. కరీంనగర్‌ను మరో బీహార్‌ల తయారు చేస్తున్నారు.. ఇక్కడ గన్ కల్చర్ పెరిగిపోయింది.. అసలు తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.

ప్రభు త్వం, పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎంతసేపు బీఆర్‌ఎస్ నేతల ఇళ్ళపై.. కార్యాలయాలపై, వ్యక్తిగత సిబ్బందిపై నిఘా పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టడం లేదన్నారు. కరీంనగర్ సీపీకి సిగ్గు శరం ఉన్నాయా? ఇప్పటివరకు దుండగులను ఎందుకు పట్టుకోలేదు’ అని ఆయన విరుచుకుపడ్డారు.