గానుగుబండలో ఐదు రూపాయలకే శుద్ధ జలాలు
ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి ఆర్థిక సహకారంతో
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఒక ఆదర్శప్రాయ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు నల్లు చిత్తరంజన్ రెడ్డి ఉమా జ్యోతి 2.20.000 రూపాయల వాటర్ ప్లాంట్ , 60.000 రూపాయల శవ పెటిక ఫ్రీజర్ గ్రామానికి అందించారు.ఈ సందర్బంగా నల్లు చిత్తరoజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల దాహాన్ని తీర్చేందుకు, ముఖ్యంగా పేదలకు అందుబాటులో శుద్ధమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు నీటిని అందించే వాటర్ ప్లాంట్‌ను సొంత గ్రామానికి అందిచడం సంతోషంగా ఉందన్నారు..గ్రామంలో త్రాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని కేవలం ఐదు రూపాయలకే (క్యాన్) వాటర్ అందించే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు.
దీని ద్వారా గ్రామంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలగనుందని . ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని సులభంగా పొందగలిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.మాకు సహకారం అందించిన సర్పంచ్ వెంకటమ్మ కర్ణాకర్ గుండగాని సూర్యప్రకాష్.మరియు దుర్గయ్య రాములు.గ్రామ పజలకు అభినందనలు తెలిపారు.గానుగుబండ గ్రామ ప్రజలందరూ నల్లు చిత్తరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి వారిని ఘనంగా సత్కరించారు.ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి కంచర్ల రాఘవరెడ్డి ఉపేంద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కంచర్ల కుశలవ రెడ్డి -పద్మ దాతగా నిలిచారు. ఈ కార్యక్రమం లో నల్లు కవిత రెడ్డి.నల్లు అరుణ రెడ్డి. భారతి రెడ్డి.సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ .ఉపసర్పంచ్ యనగందుల లావణ్య మధుసూదన్..మాజీ సర్పంచ్ నల్లు రాంచేంద్రారెడ్డి బి ఆర్ యస్ నాయకులు. గుండగాని రాములు గౌడ్. గుండగాని దుర్గయ్య. సూర్యప్రకాష్. వీరన్న పోలేపాక సోమయ్య.వీరమల్లు రవి. మల్లయ్య.పులి ముత్తయ్యయనగందుల రామచంద్రు. సత్తమ్మ.జక్కుల లింగయ్య.V లింగయ్య.అశోక్. గుండగాని వరుణ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






