15 May, 2026 | 1:51 AM

చెన్నై జోరు కొనసాగేనా?

15-05-2026 01:03 AM

పరువు కోసం లక్నో పోరాటం

లక్నో, మే 14 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మరో 10 రోజుల్లో ముగుస్తున్నప్పటకీ ఇప్పటి వరకూ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోలేదు. రెండు జట్లు మా త్రమే ఇంటిదారి పట్టగా మిగిలిన 8 జట్లు రేసులో ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు ఏ జట్టు అర్హత సాధిస్తుందోనన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది.

శుక్రవారం జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. లక్నోలోని ఏక్ నా క్రికెట్ స్టేడి యం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సీజ న్ ఫస్టాఫ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ సెకండాఫ్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ బెర్తుపై కన్నేసింది. ప్రస్తుతం సీఎస్కే 11 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐ దో ప్లేస్‌లో ఉంది. లక్నోపై గెలిస్తే టాప్ 4లో కి అడుగుపెడుతుంది.

ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లూ గెలవాల్సి ఉంటుంది. చాలా మంది కీలక ఆట గాళ్లు గాయాలతో దూరమవడంతో చెన్నైకి ప్రతికూలంగా మారినా సంజూ శాంసన్, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బాగానే పుంజుకుంది. కాగా స్టార్ ప్లేయర్ ధోనీ ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో సంజూ, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ ఫామ్‌లో ఉన్నారు. దూబే, బ్రెవి స్ కూడా చెలరేగితే చెన్నైకి తిరుగుండదు.

బౌలింగ్‌లో ఓవర్టన్ దూరమవడంతో ఇబ్బందే. దీంతో అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి పేస్ భారాన్ని మోయనుండగా.. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్, అకి ల్ హొస్సేన్ సత్తా చాటుతున్నారు. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ పరువ కోసం పోరాడనుంది. ఈ సీజన్‌లో లక్నో  అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది.  11 మ్యా చ్‌లు ఆడి కేవలం మూడింటిలోనే గెలిచి, 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచ్‌లలోనైనా గెలిచి సీజన్‌ను మెరుగైన స్థానంలో గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది.

బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్ల వైఫల్యమే లక్నో ఓటములకు కారణం. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లా ప్ అయ్యాడు. అలాగే నికోలస్ పూరన్ కూ డా ఫెయిలయ్యాడు. వీరిద్దరి వైఫల్యం లక్నో బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. కనీసం చివరి మ్యాచ్ లలోనైనా వీరిద్దరూ ఫామ్ అందుకుంటారేమో చూడాలి. బ్యా టింగ్‌లో మార్ష్, ఇంగ్లీస్ రాణిస్తుండగా బౌ లింగ్‌లో షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రతి సత్తా చాటుతున్నారు. గత రికార్డుల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. లక్నో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా.

తుది జట్లు అంచనా

చెన్నై సూపర్‌కింగ్స్ : సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, బ్రెవిస్, శివమ్ దూబే, అకిల్ హొ స్సేన్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి

లక్నో సూపర్‌జెయింట్స్ : మార్ష్, మాక్రరమ్, పంత్(కెప్టెన్), ఇంగ్లీస్, పూరన్, రఘు వంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్