‘ప్రజా పాలన ప్రణాళిక’
- నేటి నుంచి గ్రామాల్లో ప్రారంభం
విజయవంతం చేయాలి
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమం అమలుపై గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి అధికారులకు ఆమె దిశానిర్దేశం చే శారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. 99 రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించా రు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదిక రూపంలో విడుదల చేయాలని మంత్రి ఆదేశిం చారు. మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటిని వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ సభల్లో తీర్మానాలు చేయించాలని తెలిపారు. బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకా రం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
2023 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.245 కోట్లను ఆర్థిక సంఘం విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులను ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటి పనులకు వినియోగించా లని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ శుభ్రత, పన్నుల వసూళ్ల డ్రైవ్, తాగునీటి వనరుల పరిశీలన, డ్రైనేజీల శుభ్ర త, వీధి దీపాల మరమ్మతులు, చెత్త నిర్వహణ చర్యలు, ప్రభు త్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన స ర్పంచ్లు, వార్డు సభ్యుల్లో ఉన్న ఉత్సాహాన్ని వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.
పైస్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి వారం చేపట్టిన పనులు, సాధించిన పురోగతిపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పనులపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 99 రోజుల పాటు సిబ్బంది గ్రామాల్లో ఉండి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని మంత్రి తెలిపారు. సమావే శంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమా ర్, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి పాల్గొన్నారు.




