24 March, 2026 | 4:24 PM

గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

24-03-2026 02:44 PM

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్

సిద్దిపేట రూరల్: గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్క గ్రామస్తుడు సహకరించాలని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ భవనం వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. తడిపొడి చెత్తను ట్రాక్టర్‌కు మాత్రమే ఇవ్వాలని, నల్లనీటిని వృథా చేయవద్దని సూచించారు. ప్రతి ఇంటి వారు ఇంటి పన్నులు సమయానికి చెల్లించి ఆదర్శంగా నిలవాలని కోరారు.

గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించి, వాటి వేగవంతమైన అమలుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని విజయ డైరీ అధికారికి సూచించారు. అలాగే గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఏలను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆదాయం-వ్యయాల వివరాలను కార్యదర్శి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణ, ఎంపీవో విష్ణువర్ధన్, పంచాయతీ కార్యదర్శి అరుణ, వార్డు సభ్యులు రాజు, కిషన్, స్వాతి, సుజాత, పుష్పలత, నరేష్ తదితరులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.