24 March, 2026 | 4:25 PM

కొత్తపేటలో యువసేన ట్రస్ట్ రక్తదాన శిబిరం విజయవంతం

24-03-2026 02:48 PM

నాగోల్,(విజయక్రాంతి): కొత్తపేట డివిజన్‌లోని ఎస్బీఐ కాలనీలో యువసేన ట్రస్ట్ చైర్మన్ గుండ్లవరం యోగి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ... యువసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతున్న ఈ సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక ప్రాణాలను కాపాడటానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన ట్రస్ట్ సభ్యులు సురేష్, మహేష్, ప్రభాకర్, రేవెల్లి రామకృష్ణ, చకిలం ప్రశాంత్, ఆంజనేయులు, యువసేన ట్రస్ట్ మిత్రబృందం సభ్యులు మరియు బీజేపీ నాయకులు వగ్గుల సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, తిరుమల, నాయకోటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.