calender_icon.png 15 February, 2026 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందజేత

15-02-2026 03:16:22 PM

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

దహన సంస్కారాలకు డబ్బులు లేని నిరుపేద కుటుంబం

వేములవాడ,(విజయశాంతి): పట్టణంలో ముదిరాజ్ వీధికి చెందిన ఉప్పుల ఎల్లయ్య ఇతనికి మగ సంతానం లేదు. భార్య ఒక కూతురు ఉంది. భార్య పేరు చంద్రకళ, కూతురుకు పెళ్లి అయ్యింది. ఉప్పుల ఎల్లయ్య నిన్నటి రోజున సాయంత్రం అనారోగ్యంతో మరణించడంతో  దహన సంస్కరాలకు కూడా డబ్బులు లేవని వారి దగ్గర బంధువులు తెలియజేయడంతో ట్రస్టు సోషల్ మీడియా గ్రూపులో పోస్టు చేయగా దాతలు గొప్ప మనస్సుతో స్పందించి మానవతా దృక్పథంతో అందించిన

విరాళాల రూపంలో వచ్చిన రూ.25 వేలు బాధితుని భార్య చంద్రకళకు రూ.25 వేల నగదు అందజేయడం జరిగిందని ఇంకా ఎవరైనా దాతలు  విరాళాలు అందించేవారు ట్రస్ట్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 89855 88060కు అందించినట్ల యితే నిరుపేద కుటుంబానికి చెందిన ఉప్పుల ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగు తుందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్  తో పాటు డాక్టర్ బెజ్జంకి రవీందర్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ కడారి రాములు రేగుల శేఖర్ పాల్గొన్నారు.