5 March, 2026 | 4:02 AM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

05-03-2026 02:22 AM

ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ మార్చి 4: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె దవాఖానాను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం మానవపాడు మండల పరిధిలో జల్లాపురం గ్రామంలో రూ.16 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పల్లె దావాఖానా భవనాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి గ్రామ సర్పంచి నందిని వజ్ర, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కరుణ సింహా రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థల దాత ధర్మవరం బీచుపల్లి కుమారుడు నరసింహులు ,ఎంపిడిఓ రాఘవ,గ్రామ ఉప సర్పంచ్ జయరాముడు, బోరవెల్లి సర్పంచ్ హరిచంద్రా రెడ్డి,నాయకులు శేషి రెడ్డి,సత్యారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.