యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
వెల్దండ మార్చి 4: యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల రైతన్నలు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి, బస్ స్టేజిపై బైఠాయించి రైతులు రాస్తారోకో చేపట్టారు.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధన విధించడంతో దానిపై అవగాహనా లేని రైతంగం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెల్దండ రైతు ఆగ్రో కేంద్రానికి 300, సింగల్ విండో కేంద్రానికి 400 బస్తాలు యూరియా రావడంతో అందుకోసం ఉదయం 9 గంటలకతిరిగి 10:45 నిమిషాలకు అవసరమున్న రైతులు స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకోవాలని ఏఈవోలు అగ్రోసేవ కేంద్ర నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.
ఆ సమయం కంటే ముందే వచ్చిన రైతన్నలు ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాసి యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఒకరిద్దరి మినహా మిగతా వాళ్ళందరికీ యూరియా బుక్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే యూరియా కోసం వేచి ఉన్న తమకు యూరియా బుక్ కావడం లేదని స్మార్ట్ ఫోన్లతో అవగాహన లేక అవస్థలు పడుతున్నామంటూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్త్స్ర కురుమూర్తి ఏవో శోభారాణిలు రైతుల వద్దకు వచ్చి నచ్చజెప్పి యాప్ ని ఎత్తివేయాలని పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు.




