22 July, 2026 | 2:50 AM

పార్కు స్థలాన్ని కాపాడాలని ఆందోళన

21-07-2026 12:41 AM
  1. హయత్‌నగర్ సర్కిల్ ఆఫీస్ ఎదుట వంటావార్పు 
  2. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుల డిమాండ్ 

ఎల్బీనగర్, జూలై 20 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మారుతీనగర్, ఆఫీసర్స్ కాలనీకి చెందిన పార్కు స్థలాన్ని కాపాడాలని హయ త్ నగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు వంటావార్పు చేపట్టి, ఆందోళన నిర్వహించారు.  స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి భవన నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసు కెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా బీజేపీ ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేసివంటావార్పుతో నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా పార్కు స్థలం ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడంపట్ల బీజే పీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ నాయకుల నిరసనకు స్పందించిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి అక్కడికి చేరుకుని పార్కు స్థలాన్ని పరిరక్షిస్తామని అ క్రమంగా కబ్జా చేసి భవన నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్కు స్థలాన్ని జెసిబి సహాయంతో శుభ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, హస్తినాపురం అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్, నాయకులు శ్రీధర్‌రావు, అంజ న్‌కుమార్‌గౌడ్, విజయ్‌కుమార్, శ్రీనివాస్, ప్రేమ్‌నాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్‌గౌడ్, కవితారెడ్డి, కాలనీల అధ్యక్షులు దుర్గాప్రసా ద్, బాలాజీ, వెంకట్ రెడ్డి, నాయుడు, శ్రీనివాస్, అనిల్ కుమార్, అరుణ, దుర్గ, స్వాతి, సత్య ఉన్నారు.