calender_icon.png 10 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో విలువలు కాపాడేవి పత్రికలు

10-02-2026 12:31:17 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : సమాజంలో విలువలను కాపాడేవి పత్రికలేనని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విజయక్రాంతి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి కట్టుబడి పనిచేసేవి పత్రికలేనన్నారు. సమాజంలో పత్రికల పాత్ర చాలా గొప్పదన్నారు.

విజయక్రాంతి దినపత్రిక క్యాలెండర్ చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట స్టాఫ్ రిపోర్టర్ నట్టె కోటేశ్వర్ రావు, విలేకరులు ఎం.కోటి, ఎల్.నాగరాజు, పీఆర్‌ఓ ఆంజనేయులు పాల్గొన్నారు.