1 March, 2026 | 4:59 AM

ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటింటి సౌభాగ్యం

28-02-2026 06:46 PM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

శంకర్‌పల్లి,(విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఇంటింట సౌభాగ్యాన్ని అందిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య స్పష్టం చేశారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి 3,11 వార్డులలో సాయిబాబా థియేటర్, బివిఆర్ గార్డెన్ వెనకాల నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు మెచ్చి, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇంటి యజమానురాలు వనితకు కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్ చీరను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ యోగేష్, కౌన్సిలర్ లు దండు రాజేశ్వర్, గణేష్, గిరిజ చంద్రశేఖర్, లలిత మోహన్ రెడ్డి, భానురు కృష్ణ, ఉషా కిరణ్ విజయ్ కుమార్, ప్రశాంత్, అఖిల యాదవ రెడ్డి, ఫైముదా బేగం సమీ, మాజీ కౌన్సిలర్లు, మండల, మున్సిపల్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు ఉన్నారు.