17 March, 2026 | 6:26 AM

సమర్థవంతమైన సేవకున్ని ప్రతిపాదించండి

17-03-2026 01:30 AM
  1. ఐక్యతతో చేసే ప్రతి పని కాంగ్రెస్ పార్టీకి నిజమైన విజయం

వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి

వనపర్తి మార్చి 16 ( విజయక్రాంతి ) : గ్రామాలలో, మండలాలలో మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియలో సమర్థవంతమైన సేవకులను ప్రతిపాదించాలని వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షనాల్లో మండల, పట్టణ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి ఏర్పాటుచేసిన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా శివసేనారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయడంతోనే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. అలాంటి వారికోసం ఏఐ సీసీ, టిపిసిసి అధిష్టానం మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్మానంలో భాగంగా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న ఆలోచనతో సంస్థాగత బలోపేతానికి పెద్దపీఠం వేయబోతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, మున్సిపల్ చైర్మన్ నాగమణి, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, పాండు సాగర్ , మండల అధ్యక్షులు పరమేష్, మాజీ యూత్ ప్రెసిడెంట్ తులసిరాజ్,గంగాధర్, వెంకట్, కృష్ణమూర్తి, తిరుపతి, శ్రీను, కౌన్సిలర్ లు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.