రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ
17-03-2026 01:32 AM
అయిజ మార్చి 16 అయిజ మున్సిపాలిటీలోని మాసూం పీర్ దర్గా దగ్గర పవిత్ర రంజాన్ మాసం ను పురస్కరించుకొని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో తోపాల పంపిణీ కార్యక్రమం ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాస్టర్ శేక్షావల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ఆర్థికంగా లేని పేద బలహీనవర్గాల ముస్లిం కుటుంబాలకు తోపాల పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫర్హిన్ తప్సo, మద్దిలేటి, సంతోషమ్మ, ఖాజా,కాంగ్రెస్ నాయకులు మైనర్ బాబు, రాధాకృష్ణ, రాజునారాయణ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.




