వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు నిలిపివేయాలి
25-07-2026 12:00 AM
భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు, జులై 24, (విజయక్రాంతి): వైటిపీఎస్( యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ ) లోనే యాష్ ప్లాంట్,కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిలిపివేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జే ఎ సీ నాయకులు కోరారు. మణుగూరు లోని బీటీపీఎస్ సందర్శనకు శుక్రవారం వచ్చిన ఆయనను జేఏసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు ఎం ఏ వజీర్, బీటీపీఎస్ రీజినల్ కన్వీనర్ యస్. శ్రీనివాసరెడ్డి, నాయకులు రవి ప్రసాద్, నరేష్, తదితరులు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు భట్టి దృష్టికి తీసుకుని వెళ్లారు.






