26 June, 2026 | 3:18 AM

మాగంటి గోపీనాథ్ సేవలను స్మరించుకున్న ప్రముఖులు

26-06-2026 01:06 AM

జూబ్లీహిల్స్, జూన్ 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. యూసఫ్ గూడలోని శౌర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మాగంటి గోపినాథ్ చిత్రపటానికి పూలను వేసి నివాళులు అర్పించారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గోపినాథ్ లేని లోటు ఎన్నటికీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాగంటి సునీత గోపినాథ్, మాగంటి వాత్సల్యనాథ్ లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.