19-02-2026 02:08:04 AM
నూతన పాలక వర్గాలపై ఆశలు.. అస్తవ్యస్తంగా రోడ్లు..
పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు..
తప్పని ట్రాఫిక్ తిప్పలు
మెదక్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గం కొలువుదీరింది. మున్సిపాలిటీల్లో అనేక సమస్యలతో సతమత మవుతున్న ప్రజలు నూతన పాలక వర్గాల పై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిత్యం తాగునీటి సమస్యలతో ప్రజలు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు, సిసీ రోడ్లు, ఆయా వార్డుల్లో మురికి కాలువ లు ఇలా అన్ని మున్సిపాలిటీ ల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పైపు లైన్ లు పగిలి తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు...
జిల్లాలోని మెదక్, నర్సాపూర్ తూప్రాన్ రామాయంపెట్ మున్సిపాలిటీ ల్లో పారిశు ధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త తరలించే వాహనాలు రాకపోవడంతో ఇండ్లతో పాటు వీధుల్లో చె త్తా చెదారం పేరుకుపోతుంది. చెత్త సేకరణ వాహనాలు మరమ్మతులకు గురికావడం, స కాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంద ని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పారిశుధ్య సిబ్బంది కొరతతో వీధుల్లో సకాలంలో పారిశుధ్య పనులు జరగడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా మెదక్ పట్టణంలోని వైకుంఠ దామలు అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. వాటిలో కనీస సౌకర్యాలు లేక అం త్య వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే మెదక్ పట్టణం చెరువులను తలపిస్తుంది. పట్టణంలో ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీంతో వాహనదా రులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ కు తప్పని తిప్పలు ...
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ ల్లో ట్రాఫిక్ కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు చౌరస్తాల వద్ద ట్రా ఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు ఉ న్నాయి. అంతేకాకుండా పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో తోపుడు బండ్లు, కురాగాయలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేయ డంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు డ్రైనేజీలతో పాటు రోడ్లను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడం, వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కు రగాయల మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
నూతన పాలక వర్గాలపైనే పట్టణ ప్రజల ఆశలు..
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాలపైనే ప్రజలు ఆశ లు పెట్టుకున్నారు. మెదక్ పట్టణాన్ని సుందరీకరణను చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కోతులు, కుక్కల బెడతతో మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.